స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. అమెరికా, చైనా వాణిజ్య చ‌ర్చ‌ల సారంశం వెల్ల‌డి కావాల్సి ఉంది. ఈ చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌నే వార్త‌ల‌తో రాత్రి క్రూడ్ భారీగా పెరిగింది. అలాగే అమెరికాలో చ‌మురు నిల్వ‌ల రిపోర్టు కూడా బుల్స్‌కు అనుకూలంగా వ‌చ్చింది. మ‌రోవైపు రూపాయి ఇవాళ కాస్త బ‌ల‌ప‌డింది. రాత్రి అమెరికా మార్కెట్‌లో సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్ ఒక శాతం దాకా పెరిగింది. ఉద‌యం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ భారీ న‌ష్టాల్లో ఉంటే హాంగ్‌సెంగ్ మాత్రం స్థిరంగా ఉంది. ఇత‌ర సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 23 పాయింట్ల న‌ష్టంతో 10820 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది. ఆర్థిక ఫ‌లితాలు రావ‌డం ప్రారంభ‌మైంది. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ నిన్న ఆక‌ర్ష‌ణీయ ఫ‌లితాలు ప్రక‌టించ‌గా, ఇవాళ ఇన్వెస్ట‌ర్లు లాభాలు స్వీక‌రిస్తున్నారు. జేఎల్ఆర్ అమ్మ‌కాల బాగున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో టాటా మోటార్స్ వ‌రుస‌గా అయిదో రోజు టాప్ గెయిన‌ర్స్ జాబితాలో ఉంటుంది. ఇవాళ నిఫ్టి షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌లో ఈ షేర్ ఉంది. త‌ర‌వాతి స్థానాల్లో ఎస్ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇన్‌ఫ్రాటెల్ టాప్‌లో ఉంది. త‌రువాతి స్థానాల్లో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.