లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మ‌ళ్లీ వాణిజ్య చ‌ర్చలు ప్రారంభించ‌డానికి అమెరికా, చైనాల మ‌ధ్య అంగీకారం కుద‌ర‌డంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా క్లోజ్ కాగా, ఇవాళ ఉద‌యం ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రికి రాత్రి ఏకంగా రెండు శాతంపైగా పెర‌గ‌డం మార్కెట్‌కు ప్రతికూల అంశ‌మైనా... ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బ‌ల‌ప‌డ‌టం శుభ ప‌రిమాణం. నిఫ్టి ఇపుడు 60 పాయింట్ల లాభంతో  11847 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఐషర్ మోటార్స్‌, బ‌జాజ్ ఆటో, ఇండియా బుల్స్ హౌసింగ్‌,. టాటా స్టీల్ టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.