స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా... మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. మెక్సికోపై ఆంక్ష‌లు లేవ‌ని అమెరికా స్ప‌ష్టం చేయ‌డంతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఉద‌యం నుంచి  ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు రెండు శాతం దాకా లాభ‌ప‌డ్డాయి ముడి చ‌మురు ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. 11959 వ‌ద్ద స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి ఇపుడు 11915 వ‌ద్ద స్థిరంగా ఉంది. అయితే మార్కెట్ చాలా వీక్‌గా క‌న్పిస్తోంది. బ‌డ్జెట్ ముందు ర్యాలీ ఉంటుందా లేదా లాభాల స్వీక‌ర‌ణ ఉంటుందా అన్న చ‌ర్చ మార్కెట్లు జోరుగా సాగుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఓఎన్‌జీసీ, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు.... ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, స‌న్ ఫార్మా, గెయిల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయిన‌ర్స్‌... స్టెర్‌లైట్ టెక్నాల‌జీస్‌, జెన్‌సార్ టెక్‌, సింజైన్‌, థ‌ర్మాక్స్‌, ఫోర్టిస్‌
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌.... జెట్ ఎయిర్‌వేస్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఇండియా బుల్స్ లిమిటెడ్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, దీప‌క్ నైట్రేట్