న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

బ‌డ్జెట్ ముందు మార్కెట్ జాగ్ర‌త్త ప‌డుతోంది. బ‌డ్జెట్‌కు కేవ‌లం మూడు వారాల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టం, అంత‌ర్జాతీయంగా వాణిజ్య భ‌యాలు పెరుగుతుండ‌టంతో ఇన్వెస్ట‌ర్లు చాలా జాగ్రత్త‌గా ట్రేడ్ చేస్తున్నారు. నిన్నటి మాదిరే ఇవాళ కూడా మార్కెట్ న‌ష్టాల‌తో ప్రారంభ‌మై.. క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. నిఫ్టి ఇవాళ క్రితం ముగింపుతో పోలిస్తే కేవ‌లం నాలుగు పాయింట్ల న‌ష్టంతో ప్రారంభ‌మైనా.. ఇపుడు 46 పాయింట్ల న‌ష్టంతో 11868 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైనా... ఇవాళ అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్‌ స్టీల్ ఉత్ప‌త్తుల‌పై  ఇవాళ చైనా  యాంటి డంపింగ్ సుంకాలు విధించింది. దీంతో ఆసియా మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిక్కీ ఒక్క‌టే స్వ‌ల్ప లాభంతో ఉంది. ఫారెక్స్ మార్కెట్ స్థిరంగా ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా నిన్న‌టి స్థాయిలోనే కొన‌సాగుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయినర్స్‌గా నిలిచిన షేర్ల‌లో... ప‌వ‌ర్ గ్రిడ్‌, వేదాంత‌, యూపీఎల్‌, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌. నిఫ్టి టాప్ లూజ‌ర్స్ జాబితాలో ఉన్న షేర్లు... ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఎస్ బ్యాంక్‌, బ‌జాజ్ ఆటో.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... ఇంటలెక్ట్ డిజైన్‌, ఐఐఎఫ్ఎల్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, హెక్సావేర్‌, ఈక్విటీస్‌
సెన్సెక్స్ ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ లూజ‌ర్స్‌....జెట్ ఎయిర్‌వేస్‌, జేపీ అసోసియేట్స్; గ‌్రుహ్ ఫైనాన్స్‌, దీవాన్ హౌసింగ్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్