భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్నా... మ‌న మార్కెట్లు మాత్రం భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిన్న భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి... త‌ర‌వాత లాభాలన్నీకోల్పోయింది. చివ‌ర్లో కోలుకున్నా... లాభ‌న‌ష్టాలు లేకుండా ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకైన ఫెడ‌ర‌ల్‌రిజ‌ర్వ్‌... రాత్రి వ‌డ్డీ రేట్ల‌ను య‌ధాత‌థంగా ఉంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అయితే మున్ముందు వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయ‌న్న సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌న్నీ భారీ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. కొన్ని చైనా సూచీలు మూడు శాతం పెర‌గ్గా, హాంగ్‌సెంగ్ రెండు శాతం దాకా పెరిగింది. జ‌పాన్ నిక్కీ మాత్రం పరిమితం లాభంతో ట్రేడ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టి 11635 పాయింట్ల వ‌ద్ద ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 33 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల క్లోజింగ్ కావ‌డంతో నిఫ్టిలో భారీ  మార్పులు ఉండే అవ‌కాశ‌ముంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఐఓసీ, ప‌వ‌ర్ గ్రిడ్‌, బీపీసీఎల్‌, కోల్ ఇండియా షేర్లు టాప్‌గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... విప్రో, ఎస్ బ్యాంక్‌, బ్రిటానియా, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌.

బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌... అదానీ గ్రీన్‌, మాక్స్ ఇండియా, రాజేష్ ఎక్స్‌పో, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఆర్ ప‌వ‌ర్‌...
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌... శ్రేయ్ ఇన్‌ఫ్రా, జెట్ ఎయిర్‌వేస్‌, జైన్ ఇరిగేష‌న్‌, జేపీ అసోసియేట్స్‌, హెచ్‌డీఐఎల్