న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

నిన్న‌భారీ లాభాల‌తో ముగిసిన నిఫ్టి  ఇవాళ స్థిరంగా ప్రారంభ‌మై... స్వ‌ల్ప న‌ష్టాల‌తో ట్రేడ‌వుతోంది. ప్ర‌స్తుతం 38 పాయింట్ల న‌ష్టంతో 11794 వ‌ద్ద కొన‌సాగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. గ‌త రెండు రోజుల నుంచి ముడి చ‌మురు ధ‌ర‌లు 7 శాతంపైగా పెర‌గ‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఫారెక్స్‌లో డాల‌ర్‌తో రూపాయి బ‌ల‌హీనంగా ఉంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో యూపీఎల్‌, గ్రాసిం, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, వేదాంత టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్ షేర్లు... ఎస్ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మారుతీ, టాటా మోటార్స్‌. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ షేర్లలో టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్న షేర్లు.. సుజ్లాన్‌, పీసీ జ్యూవ‌ల్ల‌ర్స్‌, జైన్ ఇరిగేష‌న్‌, జేపీ అసోసియేట్స్‌, జ‌మ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌.  సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌... జెట్ ఎయిర్‌వేస్‌, శోభా డెవ‌ల‌పర్స్‌, అర‌బిందో ఫార్మా, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, రిలయ‌న్స్ ఇన్‌ఫ్రా