స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు నీర‌సంగా ఉండ‌టంతో మ‌న మార్కెట్లు కూడా అదే బాట‌లో న‌డుస్తున్నాయి. ప్రి బ‌డ్జెట్ ర్యాలీ గురించి మార్కెట్‌లో చాలా చ‌ర్చ జ‌రిగినా... విదేశీ ఇన్వెస్టర్ల అమ్మ‌కాల కార‌ణంగా నిఫ్టి స్థిరంగా ట్రేడ‌వుతోంది. శుక్ర‌వారం స్వ‌ల్ప న‌ష్టాల‌తో అమెరికా క్లోజ్ కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు నామ మాత్ర‌పు లాభ‌న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతూ పోవ‌డం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు ప్ర‌తికూలంగా ఉంది. నిఫ్టి ప్ర‌స్తుతం 13 పాయింట్ల లాభంతో 11737 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హిందాల్కో, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, యూపీఎల్‌, బ్రిటానియా, టైటాన్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి ఇక టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... బ‌జాజ్ ఆటో, హీరోమోటోకార్ప్‌, టెక్ మహీంద్రా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, బీపీసీఎల్‌.