స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

జులై డెరివేటివ్ సిరీస్ స్థిరంగా ప్రారంభ‌మైంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా... మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్ల న‌ష్టంతో 11862 పాయింట్ల వ‌ద్ద నిఫ్టి ట్రేడ‌వుతోంది. ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి మ‌రింత బ‌ల‌ప‌డింది. క్రూడ్‌ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఓ కార‌ణం కావొచ్చు. త‌గ్గినా రికార్డు స్థాయిలో క్రూడ్ ధ‌ర‌లు ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, స‌న్ ఫార్మా, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. గ‌త వారం రోజులుగా క్షీణించిన షేర్లు పెరుగుతుండ‌గా, ఇటీవ‌ల త‌గ్గిన షేర్లలో కొనుగోళ్ళ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... ఇన్‌ఫ్రా టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. బ‌డ్జెట్‌లో బ్యాంకుల మ‌ళ్ళీ మూల‌ధ‌నం ఇచ్చే ప్ర‌తిపాద‌న ఉంటుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు చిన్న బ్యాంకులు సానుకూలంగా స్పందిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్ర‌ధాన షేర్ల‌లో కార్పొరేష‌న్ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఐఓబీ, దైనిక్ భాస్క‌ర్ లిమిటెడ్‌, ఇండియా బుల్స్ లిమిటెడ్ టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... కాక్స్ అండ్ కింగ్స్‌, శోభా డెవ‌ల‌ప‌ర్స్, దీవాన్ హౌసింగ్‌, సుజ్లాన్‌, స‌ద్భావ్ ఇంజినీరింగ్.