స్థిరంగా ప్రారంభ‌మైన‌ నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన‌ నిఫ్టి

మరికొన్ని గంట‌ల్లో ఆర్బీఐ ప‌ర‌ప‌తి విధానం ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ స్థిరంగా ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌స్తుతం 11,990 వ‌ద్ద 30 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ఉన్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రి భారీగా క్షీణించాయి. ఒక ద‌శ‌లో 5 శాతం వ‌ర‌కు క్షీణించిన ముడి చ‌మురు త‌ర‌వాత స్వ‌ల్పంగా కోలుకుంది. ఆర్బీఐ ప‌ర‌ప‌తి విధానం నేప‌థ్యంలో బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ప‌వ‌ర్ గ్రిడ్‌, ఐఓసీ, హిందుస్థాన్ లీవ‌ర్‌, టైటాన్‌, బ‌జాజ్ ఆటో షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. టాప్ లూజ‌ర్స్‌లో గెయిల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్నాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ గెయినర్స్‌... ఐనాక్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, ఫోర్స్ మోటార్స్‌, ఆర్‌సీఎఫ్ 

సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌.... దీవాన్ హైసింగ్ ఫైనాన్స్‌, గెయిల్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, దైనిక్ భాస్క‌ర్‌, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్