న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల గురించి ఆర్బీఐ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో ఆ రంగానికి చెందిన షేర్ల‌లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. ముఖ్యంగా అనేక కంపెనీలు వివిధ ర‌కాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో... ఆర్బీఐ ఏం చేయ‌బోతోందో స్ప‌ష్టం కాలేదు. దీంతో ఈ కౌంట‌ర్ల‌లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలు నిధుల కొర‌త‌ను ఎదుర్కొంటుండంతో ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... మ‌న మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మైంది. మ‌న్న‌పురంతో పాటు అయిదు కంపెనీల‌కు సెబీ నోటీసులు ఇచ్చింద‌న్న వార్త‌ల‌తో ఆ గ్రూప్ సంస్థ‌ల‌తో పాటు ఇత‌ర ఎన్‌బీఎఫ్‌సీల‌లో అమ్మ‌కాలు వెల్లుతున్నాయి. నిఫ్టి 11865 వ‌ద్ద ప్రారంభ‌మైనా... కొన్ని నిమిషాల్లోనే 11765 స్థాయికి క్షీణించింది. ఇపుడు 54 పాయింట్ల న‌ష్టంతో నిఫ్టి ట్రేడ‌వుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయింది. ముడి చ‌మురు  ధ‌ర‌లు రాత్రి అనూహ్యంగా పెరిగాయి... అయినా డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిఫ్టిలో కేవ‌లం 9 షేర్లు మాత్ర‌మే గ్రీన్‌లో ఉన్నాయి. 41 షేర్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి కాస్త స్థిరంగా ఉండ‌టం విశేషం. నిఫ్టి  ప్ర‌ధాన షేర్ల‌లో వేదాంత‌, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. 

నిఫ్టిలో టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... డాక్ట‌ర్ రెడ్డీస్‌, సిప్లా, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, స‌న్ ఫార్మా, మారుతీ షేర్లు ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌, శోభా డెవ‌ల‌ప‌ర్స్‌, ఆస్ట్రాల్‌, వేదాంత షేర్లు ఉన్నాయి.  సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో మ‌న్న‌పురం ఫైనాన్స్‌, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎడ‌ల్‌వైస్‌, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, న‌వ్‌కార్పొరేష‌న్ ఉన్నాయి.