స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్న‌ప్ప‌టికీ... మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో క్లోజ్ కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నిక్కీ స్వల్ప లాభంతో ఉన్నా... ఇత‌ర మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు దాదాపు 9 శాతం పైగా క్షీణించాయి. దీంతో రూపాయిపై ఒత్తిడి త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి స్వ‌ల్ప లాభంతో ప్రారంభ‌మైంది. నిఫ్టి ప్ర‌స్తుతం 24 పాయింట్ల లాభంతో 11870 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, గ్రాసిం, ఎస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. టాప్ లూజ‌ర్స్ .జాబితాలో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, టెక్ మ‌హీంద్రా, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్న షేర్లు.... అశోకా బిల్డ్ కాన్‌, ఆర్‌సీఎఫ్‌, గ్రాఫైట్‌, ఐటీఐ, ఫ్యూచ‌ర్ రిటైల్  
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌... మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, పేజ్ ఇండ‌స్ట్రీస్‌, దివీస్ ల్యాబ్‌, వెల్‌స్ప‌న్ లిమిటెడ్‌, లుపిన్