కీల‌క స్థాయిలో నిఫ్టి

కీల‌క స్థాయిలో నిఫ్టి

న‌రేంద్ర మోడీ రెండోసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటున్న త‌రుణంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. మే డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు ఇవాళ్టితో క్లోజ్ అవుతున్నందున‌... మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.  రాత్రి అమెరికా మార్కెట్ల న‌ష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. అమెరికాకు రేర్ అర్త్ మెటీరియ‌ల్స్ ఎగుమ‌తిని చైనా ఆపే అవ‌కాశ‌ముందంటూ వార్త‌లు ఆర‌వ‌డంతో వాణిజ్య యుద్ధం మ‌రింత ముదిరింది. రాత్రి ఒక‌ద‌శ‌లో మూడు శాతంపైగా న‌ష్ట‌పోయిన చ‌మురు ధ‌ర‌లు రాత్రి అనూహ్యం పెరిగి లాభాల్లోకి వ‌చ్చాయి. నిఫ్టి ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 11900 వ‌ద్ద స్థిరంగా ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎన్‌టీపీసీ, భార‌తీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. నిఫ్టి టాప్ లూజ‌ర్స్ జాబితాలో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఐష‌ర్ మోటార్స్‌, స‌న్ ఫార్మా, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్‌లో  టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... జాగర‌ణ్ ప్ర‌కాశ‌న్‌, మ్యాక్స్ ఇండియా, అదానీ ప‌వ‌ర్‌, ఎస్‌జేవీఎన్‌, రెప్కో హౌమ్‌,  
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌గా ఉన్న షేర్లు... మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, న‌వ‌భార‌త్ వెంచ‌ర్స్ జీఎన్ఎఫ్‌సీ, ఆర్ ప‌వ‌ర్‌, చెన్నై పెట్రో