ఓపెనింగ్‌లో నిఫ్టిని దెబ్బతీసిన షేర్లు ఇవే

ఓపెనింగ్‌లో నిఫ్టిని దెబ్బతీసిన షేర్లు ఇవే

అంత‌ర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నా మ‌న మార్కెట్లు భారీ న‌ష్టంతో ఓపెన‌య్యాయి. అంత‌లోనే కోలుకుని స్వల్ప న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. యాపిల్ వార్నింగ్ త‌ర‌వాత కూడా నాస్‌డాక్ లాభంతో ముగిసింది. నిన్న రాత్రి ఒక‌ద‌శ‌లో అయిదు శాతం పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు త‌ర‌వాత భారీ అమ్మకాల‌కు లోనైంది. ప్ర‌స్తుతం ఒక‌శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. డాల‌ర్ ఇండెక్స్ కూడా క్షీణించింది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌ప‌డాల్సిన రూపాయి భారీగా ప‌త‌న‌మైంది. ఒక‌ద‌శ‌లో 70.70కి ప‌డిపోయింది. చైనా వృద్ధి రేటు మంద‌గించ‌డంతో మెట‌ల్స్‌లో అమ్మ‌కాలు పెరుగుతున్నాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 12 పాయింట్ల న‌ష్టంతో 10780 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప‌త‌నం కాకున్నా... మిడ్ క్యాప్ షేర్ల‌లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. నిన్న విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌తో పాటు దేశీయ ఫండ్లు కూడా అమ్మ‌డంతో కీల‌క షేర్లు భారీగా న‌ష్టోయాయి. ఇన్వెస్ట‌ర్లు నిన్న ఒక్క‌రోజే 1.36 ల‌క్ష‌ల కోట్ రూపాయిలు న‌ష్ట‌పోయారు. నిఫ్టి 22 షేర్లు లాభాల్లో 28 షేర్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో సిప్లా, బ‌జాజ్ ఫైనాన్స్‌, హిందుస్థాన్ లీవ‌ర్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్ లాభాల్లో ముందున్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, ఐష‌ర్‌మోటార్స్‌, ఐఓసీ ఉన్నాయి. విలీన నిష్ప‌త్తి ప్ర‌తికూలంగా ఉండ‌టంతో దేనా బ్యాంక్ షేర్లు 17 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతుండగా, విజ‌య బ్యాంక్ షేర్లు ఆరు శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి.