భారీ లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

ఎన్నిక‌ల ముందు ర్యాలీ జోరుగా సాగుతోంది. నిన్న‌టి దాకా దేశీయ కార‌ణాల‌తో పెరిగిన నిఫ్టి... ఇవాళ అంత‌ర్జాతీయ మార్కెట్ల సాకుతో పెరుగుతోంది. గ‌త‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించినా ప‌ట్టించుకోని మ‌న మార్కెట్లు... ఇపుడు అమెరికా, ఆసియా మార్కెట్ల‌కు స్పందిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. నాస్‌డాక్ రెండు శాతం పెరిగింది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా ఇదే ట్రెండ్ కొన‌సాగుతోంది. అన్ని సూచీలు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 86 పాయింట్ల లాభంతో 11252 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిన్న‌టి దాకా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల చుట్టూ సాగిన ర్యాలీ ఇపుడు ఇత‌ర రంగాల‌కు మ‌ళ్ళింది. దీంతో ఏ ఒక్క రంగ షేర్ల సూచీ కూడా ఒక శాతం మేర పెర‌గలేదు. అన్ని సూచీలు అర శాతంపైగా పెరిగాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎన్‌టీపీసీ, ప‌వ‌ర్ గ్రిడ్‌, టైటాన్‌, హిందాల్కో, టాటా మోటార్స్ ముందున్నాయి.  న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, ఐష‌ర్ మోటార్స్‌, బీపీసీఎల్‌, భార‌తీ ఎయిర్ టెల్‌, హీరో మోటార్స్ ఉన్నాయి. ఇక బీఎస్ఈలో మ‌న్‌ప‌సంద్‌,  జీఐసీ హౌసింగ్ పైనాన‌న్స్‌, గుజ‌రాత్ ఎన్ఎండీసీ లాభాల్లో ముందుడ‌గా..న‌ష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, లిండే ఇండియా ముందున్నాయి.