లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మార్చి డెరివేటివ్స్ శుభారంభం చేశాయి. మార్కెట్ లాభాల‌తో ప్రారంభ‌మైంది. నిఫ్టి దాదాపు 70 పాయింట్ల లాభంతో  10,863 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మాత్రం ఉత్సాహంగా ఉన్నాయి. పారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉన్నా...ముడి చమురు ధ‌ర‌లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ హెచ్చ‌రిక‌లు ఒపెన్‌ను ప్ర‌భావితం చేయ‌లేదు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో వేదాంత‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, గ్రాసిం, ఎస్ బ్యాంక్‌, హిందాల్కో షేర్లు లాభాల్లో ముందున్నాయి. ఇక న‌ష్టాల్లో ముందున్న  నిఫ్టి షేర్లు... భార‌తీ ఎయిర్‌టెల్‌, సిప్లా, డాక్ట‌ర్ రెడ్డీస్‌, విప్రో, ఏషియ‌న్ పెయింట్స్‌, హిందాల్కో ఉన్నాయి.  బీఎస్ఈలో లాభాలు పొందిన షేర్ల‌లో సీజీ ప‌వ‌ర్‌, సెయిల్‌, డీసీఎం శ్రీ‌రామ్‌, రిల‌య‌న్స్ నావ‌ల్‌, కేఆర్‌బీఎల్ షేర్లు ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఎస్బీఐ లైఫ్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌, స్వాన్ ఎన‌ర్జి, ఇండిగో షేర్లు ఉన్నాయి.