స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు

బ‌డ్జెట్ ముందు మార్కెట్ జాగ్ర‌త్త‌గా ముందుకు సాగుతోంది. అత‌ర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా... మ‌న మార్కెట్లు ప‌రిమితంగా స్పందించింది. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం, డాల‌ర్ బ‌ల‌ప‌డుతుండ‌టంతో మ‌న మార్కెట్  ఇత‌ర మార్కెట్ల మాదిరిగా దూకుడుగా వెళ్ళ‌లేక‌పోతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో ముగిశాయి. నాస్‌డాక్ ఒక శాతంపైగా లాభ‌ప‌డింది. నిన్న భారీ లాభాల‌తో ముగిసిన ఆసియా మార్కెట్లు ఇవాళ నామ మాత్ర‌పు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిన్న సెలవు కార‌ణంగా మూత‌ప‌డిన హాంగ్‌కాంగ్ మార్కెట్ ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ట్రేడ‌వుతోంది. మ‌న నిఫ్టి  ప్ర‌స్తుతం 11873 పాయింట్ల వ‌ద్ద ఆరు పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయిన‌ర్‌గా ట్రేడ‌వుతున్నాయి.  టాప్ లూజ‌ర్స్‌గా ట్రేడ‌వుతున్న షేర్లు... ఎస్ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, హీరోమోటార్స్‌, బజాజ్ ఆటో.