నష్టాలతో మొదలైన మార్కెట్లు

నష్టాలతో మొదలైన మార్కెట్లు

దేశీయంగా పెద్దగా పాజిటివ్‌ వార్తలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు వీక్‌గా ఉండటంతో నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. నిన్న యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో క్లోజ్‌ కాగా, రాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. నష్టాలున్నా.. చాలా స్వల్పమే. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లలో నిఫ్టి ప్రస్తుతం 10,650పైన ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో నష్టాలు అధికంగా ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్డర్‌ రావడంతో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేర్‌ భారీగా లాభపడింది. నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ రెండున్నర శాతం లాభపడగా, మిగిలిన షేర్లు చాలా స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక నష్టాలతో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో విప్రో తొలిస్థానంలో ఉంది. ఈ షేర్‌ 2 శాతంపైగా నష్టపోగా, ఏషియన్‌ పెయింట్స్ కూడా ఇదే స్థాయిలో నష్టాలతో ట్రేడవుతోంది.