లాభాల స్వీకరణతో నష్టాల ముగింపు

లాభాల స్వీకరణతో నష్టాల ముగింపు

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నా... అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి రావడంతో దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో సూచీలు ఆకర్షణీయ లాభాలు గడించినా.. చివరిదాకా నిలబడలేదు. ప్రభుత్వం బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఒకదశలో నిఫ్టి 10,785కి చేరినా... అక్కడి నుంచి వరుసగా వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్ల నష్టంతో 10,716 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ అగ్రస్థానంలో ఉంది.ఈ షేర్‌ మూడున్నర శాతం నష్టపోయింది. ఇండియా బుల్‌ హౌసింగ్‌, టాటా మోటార్స్‌, సిప్లా షేర్లు రెండు శాతంపైగా నష్టపోయాయి.