స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నా... మ‌న మార్కెట్లు మాత్రం నిస్తేజంగా ఉన్నాయి. గ‌త శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు అర శాతంపైగా లాభ‌ప‌డ‌గా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు అత్యంత ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. జ‌పాన్ నిక్కీ ఒక‌టిన్న‌ర శాతం, హాంగ్ సెంగ్ అర శాతం లాభాల‌తో న‌డుస్తుండ‌గా, చైనా మార్కెట్లు ఒక‌టి నుంచి రెండు శాతం వ‌ర‌కు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా క్షీణించాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి స్థిరంగా ఉంది. అయినా నిఫ్టి కేవ‌లం ప‌రిమిత లాభంతో ట్రేడ‌వుతోంది. ఆరంభంలో పాతిక పాయింట్ల లాభంతో ట్రేడైనా... ఇపుడు కేవ‌లం ప‌ది పాయింట్ల‌తో 11650 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఐటీ షేర్ల‌లో చిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీసీఎస్ ఒక శాతం పెర‌గ్గా, ఇన్ఫోసిస్ 3 శాతం క్షీణించింది. దీంతో ఐటీ షేర్ల‌లో అయోమయం నెల‌కొంది. ఇక ఇత‌ర కౌంటర్ల‌లో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ఒక‌ద‌శ‌లో రూ. 150ల‌కు ప‌డిపోయిన ఈ షేర్ కేవ‌లం రెండు నెల‌ల్లో రూ. 225ని దాటింది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాటా మోటార్స్‌, కోల్ ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, హిందాల్కో షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో ఇన్ఫోసిస్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, స‌న్ ఫార్మా, బీపీసీఎల్‌, గెయిల్ ఉన్నాయి. పీసీ జ్యువ‌ల్ల‌ర్స్ ఇవాళ కూడా ఏడు శాతం పెరిగింది. ఇక బీఎస్ఈ షేర్ల‌లో రెయిన్ ఇండస్ట్రీస్‌,పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, సుజ్లాన్‌, మ‌న్ ప‌సంద్‌, స్పైస్ జెట్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న షేర్లు... ఇన్ఫోసిస్‌, అదానీ ప‌వ‌ర్, శార‌దా కార్పొరేష‌న్‌, ఆర్ కామ్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్ ఉన్నాయి.