స్థిరంగా స్టాక్ మార్కెట్లు

స్థిరంగా స్టాక్ మార్కెట్లు

ఆల్ టైమ్ గ‌రిష్ఠ స్థాయిలో ట్రేడ‌వుతున్న మార్కెట్‌... ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. రాత్రి అమెరికా, ఇపుడు ఆసియా మార్కెట్లు కూడా న‌ష్టాల్లో ఉండ‌టంతో మ‌న మార్కెట్లు నామ మాత్ర‌పు న‌ష్టాల్లో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌స్తుతం 12,090 వ‌ద్ద స్థ‌తిరంగా ఉంది. ఆర్‌బీఐ క్రెడిట్ పాల‌సీ నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు చాలా జాగ్ర‌త్తగా ఉన్నారు. వ‌డ్డీ రేట్లు త‌గ్గితే లాభ‌ప‌డే రంగాల షేర్ల‌కు డిమాండ్ ఉంటోంది. నిన్న ఆటో షేర్ల ర్యాలీకి కార‌ణం ఇదే. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా క్షీణిస్తున్నాయి. డాల‌ర్‌తో రూపాయి బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్ల‌కు విదేశీ ఇన్వెస్ట‌ర్లు భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీంతో బ్లూచిప్ షేర్ల‌లో కొనుగోళ్ళు జ‌రుగుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఎన్‌టీపీసీ, ఎల్ అండ్ టీ, ప‌వ‌ర్ గ్రిడ్ టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో ముందున్న షేర్లు... హెచ్‌సీఎల్ టెక్‌, హీరో మోటోకార్ప్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, టీసీఎస్ ఉన్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌... ఐడీబీఐ, ఫిలిప్స్ కార్బ‌న్‌, బాంబే డైయింగ్‌, మ‌న్న‌పురం ఫైనాన్స్‌, సుజ్లాన్ ఉన్నాయి.  ఇక సెన్సెక్స్ ప్ర‌ధాన‌టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న షేర్లు.... డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, మ‌న్‌ప‌సంద్ ఇండ‌స్ట్రీస్‌, జెట్ ఎయిర్‌వేస్‌, నౌక‌రీ (ఇన్ఫో ఎడ్జ్‌) అపోలో హాస్పిట‌ల్స్ ఉన్నాయి.