భారీ లాభాల్లో ప్రపంచ మార్కెట్లు

భారీ లాభాల్లో ప్రపంచ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య  జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే ముగింపు దశకు వస్తాయన్న ఆశతో మార్కెట్లు పెరుగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు ఒక శాతం పెరిగాయి. నాస్‌ డాక్‌ 0.83 శాతం పెరగ్గా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.69 శాతం పెరిగింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. షాంఘై కాంపొజిట్‌ ఇండెక్స్‌ మూడు శాతం వరకు పెరగ్గా, నిక్కీ ఒకశాతం, హాంగ్‌సెంగ్‌ 0.68 శాతం పెరిగాయి. మరోవైపు డాలర్‌ స్థిరంగా ఉంది. ముడి చమురు ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.