భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

వరుస నష్టాలతో ముగుస్తున్న స్టార్ మార్కెట్ ఈరోజు కోలుకుంది. తాజాగా కొనుగోలుదారులు సూచీలను పరుగులు పెట్టించారు. దాంతో మార్కెట్‌ 318 పాయింట్లు లాభపడి 33,351 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 10,242 వద్ద ముగిసింది.

అయితే ట్రంప్‌ కొన్ని దేశాల ఉత్పత్తులకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపులు ఇస్తారనే బ్లూమ్‌బెర్గ్‌ నివేదికతో మార్కెట్‌ లాభాల్లోకి వచ్చింది. అలాగే… ఆసియా మార్కెట్లు కూడా లాభపడ్డాయి. నిక్కీ 0.5శాతం లాభపడింది. మరోపక్క యురోప్‌ మార్కెట్లు కూడా లాభాలను గడించాయి. భారత్‌కు చెందిన వాలెటైలిటీ ఇండెక్స్‌ 14.59శాతం నుంచి 7శాతానికి తగ్గింది. ఇది మార్కెట్‌పై మరింత సానుకూల ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. కాగా బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లవైపు మొగ్గుచూపారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడగా.. సన్‌ఫార్మా, టాటాస్టీల్‌, యస్‌ బ్యాంక్‌ల షేర్లు నష్టాలను చవిచూశాయి.