బడ్జెట్‌ ప్రభావం.... నిఫ్టి డౌన్‌

బడ్జెట్‌ ప్రభావం.... నిఫ్టి డౌన్‌

కేవలం ఎన్‌బీఎఫ్‌సీలను ఆదుకోవడం కోసం రూపొందించిన బ్లూప్రింట్‌ చదివేందుకే బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లుంది ప్రభుత్వం. పైగా ఆ బ్లూప్రింట్‌లో వివరాలు లేకపోవడంతో మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించింది. సాధారణ బడ్జెట్‌కు భిన్నంగా చాలా కొద్ది గణాంకాలతో రూపొందించిన బడ్జెట్‌ మార్కెట్‌కు  ఏమాత్రం రుచించలేదు. దీంతో నిఫ్టి 136 పాయింట్ల నష్టంతో 11811 వద్ద ముగిసింది. నిఫ్టి షేర్లలో కేవలం ఆరు మాత్రమే లాభాల్లో పైగా నామమాత్రపు లాభాల్లో క్లోజ్‌ కాగా 44 షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్ లూజర్స్‌ జాబితాలో ఎస్‌ బ్యాంక్‌ 9 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. మిగిలిన షేర్లు... ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, యూపీఎల్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో టేక్‌ సొల్యూషన్స్‌, మన్‌ పసంద్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఐఎల్‌, లిండి ఇండియా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ ప్రధాన టాప్ లూజర్స్‌లో కేఆర్బీఎల్‌, ఎస్‌ బ్యాంక్‌, సీమెన్స్‌, సద్భావ్‌, వాబాగ్‌  షేర్లు ఉన్నాయి.