నిఫ్టి: గెలుపు లాభాలు ఆవిరి...

నిఫ్టి: గెలుపు లాభాలు ఆవిరి...

ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తోందన్న ముందస్తు వార్తలతో ఉరకులు వేసిన నిఫ్టి... తీరా విజయం ఖరారు కావడంతో ఊసురోమంది. ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి, సెన్సెక్స్‌లపై అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా వచ్చింది. దీంతో ఇవాళ ఆర్జించిన లాభాలన్నీ కరిగి పోయి... క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్లు, సెన్సెక్స్‌ 298 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ధోరణికి భిన్నంగా మన మార్కెట్లు ఇవాళ్టి ఫలితాలకు స్పందించాయి. ఎన్డీఏ గెలుపును మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసిందని, ఇపుడు మళ్ళీ ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఒక్క రియల్‌ ఎస్టేట్‌ రంగ షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, గ్రాసిం, సిప్లా టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో... వేదాంత, ఐషర్‌ మోటార్స్‌, ఐటీసీ, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ ముందన్నాయి.