స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టంతో ఆరంభమైన మార్కెట్‌ కొన్ని క్షణాల్లో లాభాల్లో వచ్చింది. పరిమిత లాభంతో చాలా వరకు ట్రేడైన నిఫ్టి.. ఒకదశలో ఒక మోస్తరు లాభాలు గడించినా... క్లోజింగ్‌ బెల్‌ సమయానికి లాభాలన్నీ కరిగిపోయాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 28.8 పాయింట్ల లాభంతో 11,737 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. సెన్సెక్స్‌ 140 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లను మన మార్కెట్లు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడంతో కొన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీ లాభాలు గడించాయి. మిగిలిన షేర్లన్నీ నామ మాత్రపు లాభాలకే పరిమితమయ్యాయి. ఫలితాల ముందు పొజిషన్స్‌ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఎగ్జిట్‌ పోల్‌కు తీవ్ర స్థాయిలో స్పందించిన ఇన్వెస్టర్లు... వాటిని నమ్మి షేర్లు భారీ సంఖ్యలో కొనేందుకు ముందుకు రాలేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌ నిలిచాయి. ఇక నష్టపోయిన షేర్లలో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు.... టెక్‌ మహీంద్రా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌. ఇక బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో ఆర్‌ పవర్‌, నవభారత్‌ వెంచర్స్‌, భారతీ ఫైనాన్స్‌, కేఈఐ, అలహాబాద్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌... దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఇరిస్‌, ఐఈఎక్స్‌, టీమ్‌ లీజ్‌.