స్టాక్ మార్కెట్లో 'సెబి' భయం

స్టాక్ మార్కెట్లో 'సెబి' భయం

ఉదయం నుంచి స్థిరంగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్‌  ఒక్కసారిగా చివరి గంటలో భారీగా పతనమైంది. వాస్తవానికి నష్టాలతో మొదలైన యూరో మార్కెట్ లాభాల్లోకి వస్తున్న తరుణంలో మన మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడానికి కారణంగా ఇవాళ సెబి తాజా ఆదేశాలపై బిజినెస్‌ మీడియాలో వచ్చిన కథనాలే కారణమని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో పెడుతున్న విదేవీ పెట్టుబడిదారుల నిధులకు సంబంధించి ముఖ్యంగా మారిషస్ నుంచి వస్తున్న నిధులకు సంబంధించి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సెబీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. విదేశీ పెట్టుబడులు పెడుతున్న సంస్థల పూర్తి వివరాలు.. అంటే నిధులు సమకూర్చుతున్న సంస్థ, వాటి యజమానుల వివరాలతో సహా పలు కీలక సమాచారం వెల్లడించాల్సి ఉంటుందని గత ఏప్రిల్ లో సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎన్నారైలతో పాటు భారత సంతతికి చెందినవారు (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి అనర్హులు. కాని నిబంధనలకు విరుద్ధంగా మనదేశంతో అంటే ఎన్నారైలు, పీఐఓలతో సంబంధం ఉన్న సుమారు 7500 కోట్ల డాలర్ల పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్ లో ఉన్నట్లు లెక్క. అయితే తాజా నిబంధనల ప్రకారం 20018 డిసెంబర్ 31కల్లా నిబంధనలను అమలు చేయాలని సెబీ అంటోంది. అంటే 7500 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అయితే ఈ నిబంధనలను మార్చాలని అసెట్‌ మేనేజర్స్ రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా సంస్థ సెబీని కోరుతోంది. అయితే దీనిపై సెబీ ఇప్పటి వరకు స్పందించలేదు. మీడియాలో వార్తలపై కూడా సెబీ ఇంకా స్పందించకపోవడంతో ఫండ్ మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు.