స్థిరంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్థిరంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

అమ్మకాల ఒత్తిడి వచ్చినా నిఫ్టి నిలకడగా ముగిసింది. అమెరికా, ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలు గడించినా... యూరో మార్కెట్ల ట్రెండ్‌తో స్థిరంగా ముగిసింది నిఫ్టి. 11,000పైన నిఫ్టిలో ప్రధాన షేర్ల మధ్య బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌ సాగుతోంది. నిఫ్టి 50 షేర్లలో కొన్ని షేర్లు పెరిగితే.. మరికొన్ని షేర్ల తగ్గడంతో సూచీ స్థిరంగా ఉన్నా... వాస్తవానికి అనేక షేర్లు నష్టాలతో ముగిశాయి. 

  • నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే నాలుగు పాయింట్లు తగ్గి 11018 వద్ద ముగిసింది. 
  • మాక్వరి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టార్గట్‌ ప్రైస్‌ను తగ్గించడంతో ఆ షేర్‌ ధర 4.5 శాతం తగ్గింది.
  • మల్టిప్లెక్స్‌లోని బయటి ఫుడ్‌ను అనుమతించాలన్న మహారాష్ట్ర నిర్ణయంతో మల్టీ ప్లెక్స్‌ షేర్లు భారీగా క్షీణించాయి. 
  • హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎన్‌టీపీసీ రూ. 1500 కోట్ల రుణం తీసుకోనుంది.
  • కొత్త డేటాసెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు ట్రైజిన్‌ టెక్నాలజీస్‌ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్‌ ఆరు శాతం పెరిగింది.
  • ప్రభుత్వ బ్యాంకుల షేర్లు భారీగా క్షీణించాయి.
  • మీడియా షేర్ల సూచీ ఏకంగా 3 శాతం క్షీణించింది.
  • రియాల్టి షేర్ల సూచీ కూడా 1.69 శాతం తగ్గింది.
  • లాభపడిన నిఫ్టి షేర్లు ః టైటాన్‌ (3.72 శాతం) బీపీసీఎల్‌ (2.57 శాతం) బజాజ్‌ ఫైనాన్స్‌ (2.4 శాతం) ఇన్ఫోసిస్‌ (2.21 శాతం) రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (1.72) షేర్లు లాభాలతో ముగిశాయి.
  • నష్టపోయిన నిఫ్టి షేర్లుః జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ (4.54 శాతం) ఇన్‌ఫ్రాటెల్‌ (3.76శాతం) యాక్సిస్‌ బ్యాంక్‌ (2.76శాతం) ఓఎన్‌జీసీ (2.74 శాతం) గ్రాసిం (2.73శాతం) క్షీణించాయి.