లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ క్రమేణ పుంజుకొని లాభాలతో ముగిశాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 34,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 10,528 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. కాగా గ్రాసిమ్, యూపీఎల్, సిప్లా, హీరో మోటార్స్, ఎన్టీపీసీ సంస్థల షేర్లు లాభపడగా, టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. విప్రో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టైటాన్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. అలాగే... వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ మార్కెట్లు లాభాలు దక్కించుకున్నాయి.