మార్కెట్‌కు అక్షయ తళకులు

మార్కెట్‌కు అక్షయ తళకులు
వరుసగా తొ్మ్మిదో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అక్షయ తృతియ సందర్భంగా బంగారం కంపెనీ షేర్లు ఏకంగా సగటున 9 శాతంపైగా పెరిగాయి. నిఫ్టి 20 పాయింట్లు, సెన్సెక్స్‌ 90 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా... అధికస్థాయిల వద్ద వచ్చిన అమ్మకాలతో మిడ్‌ సెషన్‌ సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. యూరో మార్కెట్ల ఉత్సాహంతో సూచీలు మళ్ళీ లాభాల బాట పట్టాయి. గోయెంకా డైమండ్స్, పీసీ జ్యువల్లర్స్, టైటాన్, తారా జ్యువల్లర్స్, టీబీజడ్ షేర్లు 9 శాతం దాకా లాభపడ్డాయి. ఇక నిఫ్టి 50 షేర్లలో పవర్ గ్రిడ్, హిందుస్థాన్‌ లీవర్, టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాలతో క్లోజ్‌ కాగా, ఇన్‌ఫ్రాటెల్ నష్టాల్లో ముందుంది. యాక్సిస్ బ్యాంక్, విప్రో, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ షేర్లు 1 శాతం నుంచి 2 శాతం వరకు నష్టాలతో ముగిశాయి.