ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లకు భారీ నష్టం... 

ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లకు భారీ నష్టం... 

ట్రంప్ ఇండియా పర్యటనకు వచ్చిన సందర్భంగా దాదాపుగా రెండు దేశాల మధ్య మూడు బిలియన్ డాలర్ల ఒప్పందాలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.  రెండు దేశాల్లో ఎగుమతులు, దిగుమతులు పెరిగినట్టుగా ట్రంప్ పేర్కొన్నారు.  రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల్లో సుంకాలు తగ్గించాలని ట్రంప్ పట్టుబట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  దీని గురించి ఇప్పటి వరకు స్పష్టం తెలియలేదు.  ట్రంప్ ఇండియాకు రావడం మనదేశ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించింది.  మాములుగా మోడీ అమెరికా వెళ్ళినపుడు ఇండియా స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పుంజుకున్నాయి.  

కానీ, ట్రంప్ ఇండియాకు వచ్చిన తరువాత మన మార్కెట్లు కూడా పుంజుకుంటాయని అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా ట్రంప్ ఇండియాకు వచ్చిన సందర్భంగా మన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.  రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందాల విషయంలో కొంత సందిగ్దత నెలకొన్నది.  దీంతో స్టాక్ మార్కెట్లు  దారుణంగా పడిపోయాయి.  సెన్సెక్స్ దాదాపుగా 806 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోయింది.  చైనా వెలుపల కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం స్టాక్ మార్కెట్లు పతనానికి ఓ కారణం అని అంటున్నారు నిపుణులు.