ఓపెనింగ్‌లోనే 10600 దిగువకు నిఫ్టి

ఓపెనింగ్‌లోనే 10600 దిగువకు నిఫ్టి

ఊహించినట్లే షేర్‌ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి ప్రభావం మన మార్కెట్‌పై కన్పిస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 10600 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 59 పాయింట్ల నష్టంతో 10,574 వద్ద ట్రేడవుతోంది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి 50లో 38 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. హిందాల్కో, వేదాంత రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌ 2 శాతంపైగా నష్టంతో నిఫ్టి లూజర్స్‌లో టాప్‌లో ఉంది. ఇక లాభపడిన నిఫ్టి ప్రధాన షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ముందుంది. ఇవాళ కూడా ఈ షేర్‌ రెండు శాతంపైగా పెరిగింది. కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ఒకటి నుంచి రెండు శాతం మధ్య లాభంతో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 200 పాయింట్లు నష్టపోయింది. బీఎస్‌ఈలో లాభపడిన షేర్లలో రాడికో ముందుంది. ఈ షేర్‌ 5శాతం లాభపడింది. జుబ్లియంట్‌ ఫుడ్‌, కోల్‌ ఇండియా మూడు శాతం దాకా లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా ముందుంది. ఈ షేర్‌ 4 శాతం దాకా నష్టపోయింది. బీఈఎల్‌, హెచ్‌సీఎల్‌ ఇన్సిస్‌, అవంతి, డీబీఎల్‌ షేర్లు మూడు శాతం వరకు నష్టపోయాయి.

Photo: FileShot