నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు నీరసంగా ఉండటంతో పాటు  పీఎస్‌యూ బ్యాంకుల నష్టాల కారణంగా నిఫ్టి ఓపెనింగ్‌లోనే అరశాతం నష్టపోయింది. అమెరికాతో చర్చలను రద్దు చేస్తామని ఉత్తర కొరియా బెదిరించడంతో మళ్ళీ మార్కెట్లలో టెన్షన్‌ మొదలైంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి  ఆసియా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. నిఫ్టి 10750 ప్రాంతంలో ట్రేడవుతోంది. భారీ నష్టాలు ప్రకటించిన పీఎన్‌బీ షేర్‌ ఇవాళ పది శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ రెండు శాతం తగ్గింది. దాదాపు అన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా రెండు శాతం క్షీణించింది. రియాల్టి మినహా దాదాపు సూచీలు నష్టాల్లో ఉన్నాయి.  లాభాలతో ట్రేడవుతున్న నిప్టి షేర్లలో  టెక్‌ మహీంద్రా ముందుంది. హిందాల్కో, టాటా మోటార్స్‌, వేదాంత, టాటా స్టీల్‌ కూడా స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఈలో ఇండియా బుల్స్‌ రియాల్టి షేర్‌ 5శాతం లాభంతో ట్రేడవుతోంది. సుజ్లాన్‌, ఎంఫసిస్‌, కేఈసీ, ఎన్‌ఐఐటీ టెక్‌ లాభాల్లో ఉన్నాయి.