మొదటి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

మొదటి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న ఇంగ్లాండ్ ను భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ మొదట్లోనే దెబ్బ తీసాడు. ఇద్దరు ఓపెనర్లను వరుస ఓవర్లలో ఔట్ చేసాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చడంతో 30 పరుగులకే మూడు వికెట్లు కోపోయింది ఇంగ్లాండ్. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన  స్టోక్స్(24) అలాగే బెయిర్‌స్టో(28) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా మొదటి సెషన్ ను పూర్తి చేయడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 74/3 తో నిలిచింది. అయితే మేతేరా పిచ్ గత మ్యాచ్ లో స్పిన్ కు అనుకూలించినంతగా ఈ మ్యాచ్ లో అనుకూలించడం లేదు అని మ్యాచ్ చూస్తేనే అర్ధం అవుతుంది.