సత్తెనపల్లిలో పోయిన కంప్యూటర్లు ప్రత్యక్షం !

సత్తెనపల్లిలో పోయిన కంప్యూటర్లు ప్రత్యక్షం !

అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన క్యాంప్ ఆఫీసుకు తరలించి, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్న నేపధ్యంలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన మీద మరో రకమైన ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ వాళ్లు సత్తెనపల్లిలో కంప్యూటర్‌ శిక్షణ కోసం కంప్యూటర్లు తెచ్చిపెడితే వాటిని కోడెల కుటుంబ సభ్యులు కాజేశారని రెండ్రోజుల క్రితం అంబటి విమర్శించారు. కంప్యూటర్ల విషయం మీద విచారణ మొదలయ్యే అవకాశం ఉందని తెలుసుకునే ఆయన కంపూటర్ ల దొంగతనం నాటకం ఆడారని ఆరోపించారు.

అయితే తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో చోరీకి గురయిన కంప్యూటర్లు దొరికాయి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ మాజీ మేనేజర్ అజిష్ చౌదరి కంప్యూటర్లను డీఆర్డీఏ కార్యాలయంలో వదిలివెళ్లాడు. కంప్యూటర్లను కార్యాలయం వాచ్మెన్ కు అప్పజెప్పిన అజిష్‌ చౌదరి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీనిపై స్పందించిన అధికారులు వాచ్మెన్ ను సస్సెండ్ చేశారు. ఈ కంప్యూటర్లను అపహరించినట్టు కోడెలపైనా, ఆయన కుమారుడిపైనా గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు సత్తెనపల్లిలో పోలీసులకు ఫిర్యాదుచేశారు.