నంది విగ్రహం దొంగలు దొరికారు.. కానీ..

నంది విగ్రహం దొంగలు దొరికారు.. కానీ..

రామచంద్రపురం పట్టణంలోని త్రిపుర సుందరి అగస్తేశ్వరస్వామి ఆలయంలో గత నెల 23న బుధవారం అపహరణకు గురైన 1000 కేజీల నంది విగ్రహం దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దేవస్థానానం ఉద్యోగి పెంకే శ్రీనువాస్, అతని సోదరుడు పెంకే వీర వెంకట్రావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. వారితోపాటు వీరిద్దరితోపాటు మరో ఐదుగురుని రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. మణిమాణిక్యాలు, వజ్రాలు ఉంటాయనే అపోహతో వీరు నంది విగ్రహాన్ని చోరీ చేశారని.. ఆ తర్వాత పగలగొట్టారని పోలీసులు చెప్పారు.