మెహబూబా ముఫ్తీ కాన్వాయ్ పై రాళ్లదాడి

మెహబూబా ముఫ్తీ కాన్వాయ్ పై రాళ్లదాడి

పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ కాన్వాయ్‌పై సోమవారం రాళ్ల దాడి జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఆమె సురక్షితంగా బయటపడగా.. కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఖిరాం గ్రామంలోని ఓ ఆధ్మాత్మిక ప్రదేశానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగుల బారి నుంచి ఆమెను కాపాడిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది సాయంతో ఆమె బిజ్‌బెహరా పట్టణానికి చేరుకుని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాళ్ల దాడిలో మెహబూబా ముఫ్తీ డ్రైవర్‌కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెహబుబా ముఫ్తీ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అనంత్‌నాగ్ నుంచి ఆమె లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.