ఎమ్మెల్యే హరిప్రియ ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి..

ఎమ్మెల్యే హరిప్రియ ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన బానోత్ హరిప్రియ.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే, ఇవాళ ఆమె ఎన్నికల ప్రచారంపై రాళ్ల దాడి జరిగింది. ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం గోవింద్రల గ్రామంలో హరిప్రియ ప్రచారం నిర్వహిస్తుండగా అడ్డుకున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఆమె పార్టీ మారడంపై అసహనంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ప్రచారం అడ్డుకోగా... దీంతో కాంగ్రెస్ -టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. వాగ్వాదం, తోపులాట.. ఆ తర్వాత రాళ్ల దాడికి దిగాయి ఇరు వర్గాలు... రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించారు.