మారుతి సమస్య: కార్లు ఎక్కడ పెట్టాలి?

మారుతి సమస్య: కార్లు ఎక్కడ పెట్టాలి?

వరుసగా కొన్ని నెలల నుంచి వరుసగా తన వాహనాలకు డిమాండ్‌ పడిపోతుండటంతో మారుతీ కంపెనీకి కొత్త సమస్య వచ్చి పడింది. తయారైన కార్లను ఎక్కడ స్టోర్‌ చేయాలో తెలియడం లేదు. దీంతో ఈవారం ఒక రోజు పాటు ఉత్పత్తిని నిలిపేసింది. ఒక రోజు ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. గురుగావ్‌, మానేసర్‌లోని రెండు ప్లాంట్లలో ఏడాదికి 15.5 లక్షల కార్లను మారుతీ తయారు చేస్తోంది. తమ వద్ద కార్లను నిల్వ చేసే స్థలం లేదని దేశవ్యాప్తంగా డీలర్లను నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. మరోవైపు తాజాగా వచ్చిన గణాంకాలు కంపెనీని షాక్‌కు గురి చేస్తున్నాయి. మే నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది మే నెలలో కంపెనీ 1,72,512 కార్లను ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది ఇదే నెలలో కేవలం 1,34,641 వాహనాలను మాత్రమే తయారు చేసింది. ఎగుమతులు కూడా తగ్గాయి. నగరాల్లో  కార్ల అమ్మకాలు బాగా మందగించాయని, పట్టణాల్లో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. రుణాలు ఇచ్చే నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బాగా తగ్గిందని ఆటో మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.