పిడుగుపాటుకు ముగ్గురు మృతి

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. విజయనగరం జిల్లాలో పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం , కురుపాం, కొమరాడ, బొబ్బిలి, మక్కువ, విజయనగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేటలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.