రివ్యూ : స్త్రీ (హిందీ మూవీ)

రివ్యూ : స్త్రీ (హిందీ మూవీ)

నటీనటులు : రాజ్ కుమార్ రావ్, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠి తదితరులు 

మ్యూజిక్ : సచిన్, జిగర్

ఫోటోగ్రఫీ : అమలేందు చౌదరి 

నిర్మాతలు : దినేజ్ విజన్, రాజ్, డీకే

దర్శకత్వం : అమర్ కౌశిక్ 

రిలీజ్ డేట్ : 31-08-2018 

ఆషికి 2 సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్దాకపూర్ వరస విజయాలతో దూసుకుపోతున్నది. మరోవైపు విలక్షణ సినిమాల ద్వారా రాజ్ కుమార్ రావు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.  ఈ ఇద్దరు కలిసి నటించిన స్త్రీ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది.  1990 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాల్లో ఓ పుకారు ఉండేది.  గ్రామాల్లో ఆడదయ్యం తిరుగుతుందని.. అది ఇంటికి దగ్గరికి వచ్చి ఇంట్లో వాళ్ళని పిలుస్తుందని పుకార్లు వచ్చేవి.  అందుకే ఇంటి గోడలపైన ఓస్త్రీ రేపురా అని రాస్తుంటారు.  ఈ కథనాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  

కథ : 

రాజ్ కుమార్ రావ్ చందేరి అనే గ్రామంలో టైలర్ గా పనిచేస్తుంటాడు.  ఓసారి ఊరిలో జాతర జరుగుతుంది.  ఆ జాతరలో శ్రద్దా కపూర్ పరిచయం అవుతుంది.  ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.  ప్రేమించిన రాజ్ కుమార్ రావు కు తనది ఆ ఊరు కాదని, జాతర సమయంలో మాత్రమే ఊరు వస్తుంటా అని చెప్తుంది.  అలా జాతర జరిగే సమయంలో మాత్రమే ఎందుకు వస్తుంది..అనే అనుమానం రాజ్ కుమార్ కు కలుగుతుంది..? అసలు ఆమె ఎవరు.. ? కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరిలో ఓ నర్తకి అనూహ్యంగా అదృశ్యం అవుతుంది.. ఆమెకు శ్రద్దాకు ఏమైనా సంబంధం ఉందా..?  శ్రద్దా కపూర్ దెయ్యమా కాదా..? చివరకు ఏమైంది అన్నది చిత్ర కథ.  

విశ్లేషణ : 

హర్రర్ జానర్ లో ఈ మధ్య అనేక సినిమాలు వస్తున్నాయి.  చిన్న పాయింట్ తో కథను తయారు చేసుకొని.. దాని చుట్టూ బలమైన కథనాలు అల్లుకొని సినిమాలు తీస్తున్నారు.  హాలీవుడ్ తహారలో బాలీవుడ్ లో కూడా ఇలాంటి హర్రర్ సినిమాలు విరివిగా వస్తున్నాయి. హర్రర్ జానర్ లో సినిమాను తెరకెక్కించడం అంత సుళువైన విషయం కాదు. కథ ఎంత బలంగా ఉంటుందో కథనాలు కూడా అంతే భయపెట్టే విధంగా ఉండాలి.  అప్పుడే సినిమా నిలబడుతుంది.  ప్రేక్షకులు థ్రిల్ కు లోనవుతారు.  సినిమాతో కనెక్ట్ అవుతారు.  స్త్రీ సినిమా విషయం తీసుకుంటే.. ఇందులో హర్రర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు.  1990 దశకంలో ఆంధ్ర.. కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో గోడలపైన ఓస్త్రీ రేపురా అని రాసుకునేవారు.  గ్రామంలో ఆడ దయ్యాలు తిరుగుతున్నాయని, అవి ఇంట్లో వారిని ఎత్తుకెళ్తాయనే ప్రచారం జరిగింది. దానిని కథాంశంగా తీసుకున్నారు.  ఇలాంటి కథనాలు బాలీవుడ్ కు కొత్త కావడంతో థియేటర్ లో నవ్వులు పూయిస్తున్నాయి.  స్త్రీ పాత్రలో శ్రద్దా కపూర్ అతికినట్టుగా సరిపోయింది.  రాజ్ కుమార్ రావ్ కు అతని స్నేహితులకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా చిత్రీకరించాడు దర్శకుడు.  

నటీనటుల పనితీరు : 

రాజ్ కుమార్ రావు అమాయకత్వంతో కూడిన నటన ఆకట్టుకుంది.  స్త్రీ పాత్రలో శ్రద్దా కపూర్ సూపర్ గా నటించింది.  ముఖ్యంగా శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు అతని స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నాయి.  కృతిసనన్ సాంగ్ బాగుంది.  

సాంకేతిక విభాగం : 

దర్శకుడు కు ఇది తొలిసినిమా.  మొదటి సినిమాను హర్రర్ కామెడీ జానర్ ను ఎంచుకోవడం సాహసంతో కూడుకున్నదే.  కొత్తవాడైన దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు.  సచిన్, జిగర్ లు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.  స్రీన్ ప్లే, నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

నటీనటులు 

మైనస్ పాయింట్స్ : 

అక్కడక్కడా సన్నివేశాల సాగతీత 

చివరిగా: స్త్రీ ఎక్కువగా భయపెట్టలేకపోయింది..!!