ఎన్‌పీఏలకు 6049 ఉద్యోగులు బాధ్యులు

ఎన్‌పీఏలకు 6049 ఉద్యోగులు బాధ్యులు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలకు 6,049 మంది బాధ్యులుగా ప్రభుత్వం తేల్చింది. 2017-18లో  వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇవాళ పార్లమెంటులో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినవారిపై  స్వల్ప, భారీ  జరిమానాలు విధించినట్లు మంత్రి చెప్పారు. కొంత మంది ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కూడా ఆయన వెల్లడించారు.  ఎన్‌పీఏ ఖాతాల విషయలో ఈ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 19 జాతీయ బ్యాంకులు రూ. 21388 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించినట్లు అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. వీటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ కూడా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ బ్యాంకుల నష్టాలు రూ. 6861 కోట్లని మంత్రి చెప్పారు.