అనంత‌పురంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్..!

అనంత‌పురంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్..!

క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌డంతో...  అనంతపురం సిటీలో రేపటి (మంగ‌ళ‌వారం) నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు అధికారులు..  ఉదయం 6 గంట‌ల నుంచి ఉద‌యం 11 గంటల వ‌ర‌కు మాత్ర‌మే రోడ్ల‌పైకి అనుమ‌తిస్తారు.. ఉదయం 11 గంటల తర్వాత విచ్చల విడిగా రోడ్లపైకి వచ్చినా... బలాదూర్‌గా తిరిగినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, మాస్కు ధరించని వారికి... అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి జ‌రిమానాలు త‌ప్ప‌వు.. ఉదయం 11 తర్వాత గస్తీ పెంచేందుకు మరో 6 మొబైల్ పార్టీలు పెంచారు.. పోలీసు, నగర పాలక సంస్థ విభాగాల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ప‌నిచేయ‌నున్నాయి.. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేయ‌డం లేదా భారీగా జరిమానాలు విధించేలా నిర్ణ‌యం తీసుకున్నారు అధికారులు.