రజనీ సినిమా షూటింగ్‌పై విద్యార్థుల దాడి !

రజనీ సినిమా షూటింగ్‌పై విద్యార్థుల దాడి !

మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'దర్బార్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఒక కాలేజ్ ప్రాంగణంలో జరుగుతోంది.  దీంతో చిత్రీకరణను చూసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో లొకేషన్ వద్దకు చేరుకుంటున్నారు.  కొందరు స్టూడెంట్లు షూటింగ్ ఫోటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.  దీన్ని నిలువరించేందుకు యూనిట్ సభ్యులు విద్యార్థుల్ని లోకేషన్ వద్దకు రాకుండా రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు.  దీంతో ఆగ్రహించిన కొందరు విద్యార్థులు యూనిట్ పై రాళ్లు విసిరి దాడి చేశారు.  దీంతో మురుగదాస్ లొకేషన్ చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.