డ‌బ్బుకు నీట్ దాసోహం

డ‌బ్బుకు నీట్ దాసోహం

కీల‌క స‌బ్జెక్టుల్లో మైన‌స్ మార్కులు వ‌చ్చినా...
ర్యాంకు ఆరు ల‌క్ష‌ల‌కు చేరుతున్నా...
ఆ విద్యార్థులు నీట్‌గా మెడిక‌ల్ కాలేజీల్లో చేరిపోతున్నారు.
డ‌బ్బుకు లోకం దాసోహం అన్న‌ట్లు ... నీట్ కూడా డ‌బ్బుకు దాసోహ‌మైపోయింది...

వైద్య‌విద్య‌లోని స‌ర్వ‌రోగాల‌కు నివారిణిగా ప‌బ్లిసిటీ పందిన నీట్‌... వాస్త‌వంలో చ‌తికిల‌ప‌డింది.
ప‌ర్సంటేజీకి, ప‌ర్సంటైల్‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ధ‌నిక‌,పేద విద్యార్థుల మ‌ధ్య తేడా కొన‌సాగించ‌డంలో స‌క్సెస్ అయింది.
ప్ర‌తి స‌బ్జెక్టులోనూ క‌నీసం ఇన్ని మార్కులు రావాల‌న్న నిబంధ‌న లేక‌పోవ‌డంతో సున్నా కాదు క‌దా నెగిటివ్ మార్కులు వ‌చ్చిన విద్యార్థులు కూడా మెడిక‌ల్ సీట్లు పొందుతున్నారు. వైద్య‌విద్య అనే స‌రస్వ‌తీ క్షేత్రంలో  వార్ వ‌న్‌సైడ్‌గా మారింది. ధ‌న‌ల‌క్ష్మీదే పై చేయిగా నిలిచింది.

గ‌త ఏడాది అంటే 2017లో మెడిక‌ల్ కాలేజీల్లో చేరిన విద్యార్థుల జాబితాతో టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక ఓ చ‌క్క‌టి విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం ఇచ్చింది. క‌టాప్ మార్కులు రాకున్నా... మెడిక‌ల్ కాలేజీల్లో చేరిన  విద్యార్థుల మార్కుల జాబితాను విశ్లేషించింది. వీరిలో 400 మంది విద్యార్థుల‌కు ఫిజిక్స్,కెమిస్ట్రీల‌లో ఏక అంకెలో అంటే ప‌ది లోపు మార్కులు వ‌చ్చాయి. ఇదే స‌బ్జెక్టుల్లో సున్నా లేదా మైన‌స్ మార్కులు పొందిన‌వారు  ఎంబీబీఎస్‌లో చేరారు. వీరిలో చాలా మంది ప్రైవేట్ కాలేజీల్లో చేరారు. దీనికి కార‌ణం ఏదైనా స‌బ్జెక్టులో ఫెయిల్ అయితే అన‌ర్హుల‌నే నిబంధ‌న లేక‌పోవ‌డం. 

నిబంధ‌న‌ను నీరుగార్చారు.
వాస్త‌వానికి ఇలాంటి నిబంధ‌న 2010లో ఉండేద‌ని టైమ్స్ పేర్కొంది. ఒరిజిన‌ల్ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ప్ర‌తి స‌బ్జెక్టులో విద్యార్థి క‌నీసం 50 శాతం మార్కులు పొందాల‌నే నిబంధ‌న ఉండేది. కాని త‌ర‌వాత వచ్చిన నోటిఫికేష‌న్ల‌లోఈ నిబంధ‌న 40 శాతం మార్కులుగా స‌డ‌లించారు. 2012లో ప‌ర్సంటేజీని కాస్త ప‌ర్సంటైల్‌గా మారుస్తూ... క‌నీస మార్క‌ల నిబంధ‌న ఎత్తివేశారు.  క‌నీసం ఇన్ని మార్కులు రావాల‌నే నిబంధ‌న‌నే ఎత్తివేశారు. నీట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సుప్రీంకోర్టు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న నోటిఫికేష‌న్‌కే ఓకే చెప్ప‌డంతో... అవే నిబంధ‌న‌లు  అంటే ప‌ర్సంటేజీ బ‌దులు ప‌ర్సంటైల్ రావ‌డం అలాగే క‌నీస మార్క‌ల ఎత్తివేస్తూ వెలువ‌డిన నోటిఫ‌కేష‌నే అమ‌లవుతూ వ‌స్తోంది. దీంతో మార్కుల వ్య‌వ‌హారం హాస్యాస్పందంగా మారింది.ఇందాక రాసిన‌ట్లు  విద్యార్థుల మార్కుల‌ను టైమ్స్ విశ్లేషింగా... 720 మార్కుల‌కుగాను 150క‌న్నా త‌క్కువ మార్కులు వ‌చ్చిన విద్యార్థులు 1990 మంది ఉన్న‌ట్లు తేల్చింది. అలాగే ప‌దిక‌న్నా త‌క్కువ మార్కులు వ‌చ్చిన‌వారి సంఖ్య 530 మంది. వీరిలో కొంద‌రికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీల‌లో (రెండింటిలో కూడా) జీరో మార్కులు వ‌చ్చాయి. ఇలా 150 క‌న్నా త‌క్కువ మార్క‌లు వ‌చ్చిన విద్యార్థులు చాలా మందే ఉన్నార‌ని టైమ్స్ పేర్కొంది.

ఖ‌రీదైన విద్య‌...
జీరో మార్కులు వ‌చ్చినా అడ్మిష‌న్ పొందిన 530 మంది విద్యార్థుల్లో 507 మంది ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల్లో చేరారు. ఈ కాలేజీల్లో కేవ‌లం ఒక్క ఫీజు ఏడాదికి రూ. 17ల‌క్ష‌లుగా ఉన్నాయి. హాస్ట‌ల్‌, మెస్‌, లైబ్ర‌రీ, ఇత‌ర ఖ‌ర్చ‌లు అద‌నం. ఇంత ఖరీదైన విద్య ఎవ‌రు భ‌రిస్తారు? అందుకే ధ‌నిక పిల్ల‌లు చాలా ఈజీగా ఈ కాలేజీల్లో చేరిపోతున్నారు.. సున్నా మార్క‌లు వ‌చ్చినా...ఈ విద్యార్థుల్లో స‌గానికి పైగా విద్యార్థులు డీమ్డ్ యూనివ‌ర్సీట‌ల‌కు  చెందినవారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీలు త‌మ‌కు తాము ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించుకుంటాయి. ఈ పరీక్ష‌లు పాసైతే...ఇక్క‌డి విద్యార్థులు రిజ‌స్ట‌ర్ చేసుకుని, డాక్ట‌ర్లుగా ప్రాక్టీస్ చేసుకోవ‌చ్చు. అంటే ఒక్క‌సారి అడ్మిష‌న్ పొందితే.. పాస్ కావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఎందుకంటే కోట్లు తీసుకుని పాఠాలు చెప్పే కాలేజీలు...చివ‌ర్లో త‌మ విద్యార్థుల‌ను ఫెయిల్  చేస్తాయా?