'నిర్భయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

'నిర్భయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘నిర్భయ్‌’ను సోమవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిర్భయ్ క్షిపణిని.. ఒడిషా, చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయ వంతంగా ప్రయోగించారు. నిర్భయ్‌ క్షిపణి.. 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. టర్బోఫ్యాన్‌ లేదా  టర్బోజెట్‌ ఇంజిన్‌తో ఇది ప్రయాణించనుంది. అత్యాధునిక నావిగేషన్‌ సిస్టమ్‌తో దూసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు.  నిర్భయ్ క్షిపణి యొక్క ట్రయల్ రన్ నవంబర్ 7, 2017లో విజయవంతంగా నిర్వహించారు.