టీటీడీలో క్రిస్టోఫర్‌ నియామకంపై క్లారిటీ ఇచ్చిన వైవీ

టీటీడీలో క్రిస్టోఫర్‌ నియామకంపై క్లారిటీ ఇచ్చిన వైవీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డీఈవోగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారన్న వార్తలు నిన్నటి నుంచి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. బోర్టు డీఈవోగా క్రిస్టోఫర్‌ను నియమించామన్న వార్త పూర్తిగా అవాస్తవం అని అన్నారు. ఇలాంటి వార్తలు ప్రచురించేముందు అవి వాస్తవాలా కాదా అని మీడియా సంస్థలు నిర్థారించుకోవాల్సి ఆయన సూచించారు.  టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను కొంత మంది స్వాగతించలేకపోతున్నారని ఆరోపించిన వైవీ సుబ్బారెడ్డి.. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 50 రోజుల్లో టీడీపీ మరింత దిగజారిందని విమర్శించారు. టీటీడీ విషయంలో అసత్య ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.