జీ చైర్మన్ పదివికి గుడ్‌బై చెప్పిన సుభాష్ చంద్ర

జీ చైర్మన్ పదివికి గుడ్‌బై చెప్పిన సుభాష్ చంద్ర

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్‌ సుభాష్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయతే బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా మాత్రం ఆయన కొనసాగునున్నారు. వాటాదారుల మార్పు దృష్ట్యా ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. వెంటనే కంపెనీ బోర్డు రాజీనామాకు ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్‌బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో తెలిపింది. మరో వైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను (సెకండరీ మార్కెట్ ప్లేస్‌మెంట్ ద్వారా) 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  నవంబర్ 21 న జీల్‌లో  2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిందనీ తెలిపింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ సంస్థ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్‌హైమర్ ఫండ్‌కు రూ.  4,224 కోట్లకు విక్రయించన్నుట్టు ఈ నెలలో ప్రకటించింది. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది.