బాలాకోట్ లేకపోతే బీజేపీకి 160 సీట్లే వచ్చేవి

బాలాకోట్ లేకపోతే బీజేపీకి 160 సీట్లే వచ్చేవి

తన ముక్కుసూటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామికి మామూలే. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొనడమే కాదు.. అక్కడ ప్రొఫెసర్ గా పనిచేసిన స్వామి.. ప్రతిపక్ష పార్టీలనే కాదు, సొంత పార్టీ, ప్రభుత్వాన్ని కూడా విడిచిపెట్టరని మరోసారి రుజువు చేసుకున్నారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు జరగకపోయి ఉంటే ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లే వచ్చేవని హఫ్ పోస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రహ్మణ్య స్వామి కుండబద్దలు కొట్టారు. అయోధ్యకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'వచ్చే సారి నేను ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని' ప్రకటిస్తే మిగతా విషయాలన్ని పక్కకు వెళ్తాయని చెప్పారు. అప్పుడు రాజకీయ చిత్రం మొత్తం మారిపోయి బీజేపీకి కచ్చితమైన మెజారిటీ ఖాయంగా వస్తుందని స్వామి ధీమా వ్యక్తం చేశారు.