'టెక్నాలజీతో స్నేహమే కాదు శతృత్వం కూడా..'

'టెక్నాలజీతో స్నేహమే కాదు శతృత్వం కూడా..'

టెక్నాలజీతో స్నేహమే కాదు శతృత్వం కూడా పెరుగుతోందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 'సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ'పై ఇవాళ విజయవాడలో సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుచరిత మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ రూపంలో శత్రువులు చేతుల్లోనే ఉంటున్నారని అన్నారు. స్పై యాప్స్‌తో మహిళలు జాగ్రత్తగా ఉండాలన్న ఆమె.. మహిళలు, పిల్లలే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌ అని అన్నారు. ఫేస్ బుక్ మోసాలు పెరిగిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై మహిళలు ముందుకొచ్చి కేసులు పెట్టాలని డీజేపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. మహిళలు పోలీస్ స్టేషన్‌కు రావడానికి ఇబ్బందిగా అనిపిస్తే స్టేషన్‌కు రాకుండానే కేసులు పెట్టే వెసులుబాటు కల్పిస్తామన్నారు.