హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్‌చల్‌..!

హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్‌చల్‌..!

పోలీసులు నిర్వహించే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రతీసారి ఏదో ఒక కొత్త తరహా వ్యవహారం బయటకు వస్తుంది... కొన్నిసార్లు ప్రముఖులు పట్టుబడితే... మరికొన్ని సార్లు తామేం తక్కువ అంటూ అమ్మాయిలు సైతం... చుక్కేసి... డ్రైవింగ్ చేస్తూ పట్టుడతారు... ఇక, శివరాత్రి సమయంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో విదేశీయులు హల్చల్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు.. అయితే, మద్యం మత్తులో బైక్ నడుపుతూ సూడాన్ దేశీయుడు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. సూడాన్ దేశీయులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో అతన్ని బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు ట్రాఫిక్ పోలీసులు.. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 14 మందిపై కేసులు బుక్ చేసినట్టు తెలిపారు.